వస్తావు...
నవ్వుల
పువ్వులను విరజిమ్మి..
మనసంతా,తీపి జ్ఞాపకాలను నింపి..
వెళ్ళిపోతావు! వయ్యారంగా!!
పువ్వులను
ఏరుకొని,
పులకింతలలో
తేలిపొయే
పిచ్చిప్రేమికుడిని
నేను!
వస్తావు...
కళ్ళలో
కళ్ళు కలపి..
హొయలుగా
ఓ క్రీగంటి చూపు విసిరి..
హ్రుదయాన్ని
దోచుకెళ్ళిపోతావు..
బాణాల దెబ్బకు
విలవిలలాడే
హ్రుదయం కోల్పోయిన
ప్రేమ పక్షిని
నేను!
వస్తావు...
కలల
అలల పై కావ్యకన్యలా
కను
రెప్పలపై నాట్యమయూరిలా..
కంటికి
కునుకురానీక..
కమ్మని
జ్ఞాపకలని నింపుతావు..
పగలయినా
రేయయినా
విరామం
లేని నీకలలు!
నీ
ఊహల ఊపిరితో
నా
గుండె చప్పుళ్లు
ఇలా
సాగిపోవలాసిందేనా?
అందుకేనేమో
అంతా అంటున్నారు నన్ను
ఓ
ప్రేమ పిపాశినని!