// నాన్న// ఫణీంద్ర//16.06.2013
నుదుటి మీది ముద్దుతో నిద్రలేపే లాలిత్యం
కాకమ్మ చిలకమ్మల కధలతో..నిద్రపుచ్చే సహనం..
అమ్మ కొడితే అక్కున చేర్చుకొనే అనురాగం
తిట్టయినా తిట్టకుండా తీర్చి దిద్దిన ప్రేమానురాగం
ఆటలు పాటలు..అన్నీ నేర్పిన మంచి నేస్తం
బొమ్మలెన్నో తెచ్చి ముద్దు లిచ్చే బంగారం
చేయి పట్టి మంచి మార్గాన నడిపించిన దీపం
ఉజ్వల భవిష్యత్ ని అందించిన ఆదర్శ మార్గం...
అమ్మ ప్రేమను మించిన ప్రేమను అందించే
అపూర్వ ప్రేమానుభంధం.....నాన్న
…… ఫణీంద్ర//16.06.2013