Monday, August 5, 2013


బుల్ రంకెలేశ్తే ఏంటి?
బేర్ బావురుమంటే ఏంటి?
ఒక్క రోజులో వందని వెయ్యి చేయాలనే దురాశ నాకు లేదుగా!

సువర్ణం ధగధగ లాడిపోతుంటే ఏంటి
వెండి వెలవెల పోతే ఏంటి?
బాంక్ ఖాతాలో నా బాలన్స్ వెయ్యిరుపాయలేగా!

పెట్రొల్ భగభగ మంటే ఏంటి
డీశెల్ ధర కనిస్టానికి పడిపోతే ఏంటి?
కార్లున్నవడినా?స్కూటర్లున్నవాడినా?

ఎగిరే విమానాల చార్జీలు పెరిగితే ఏంటి?
పరుగులు తీసే రైళ్ళలో బెర్త్ లు దొరక్కపోతే ఏంటి?
బయటి ప్రపంచంతో పనిలేకుండా బ్రతికేసే సగటు మనిషి నేగా!

సెల్ మోడళ్ళు ఎన్నొస్తే ఏంటి?
కంప్యూటర్లు,కాకరకాయలతో మార్కెట్ నిండిపోతే ఎంటి?
నా కున్న నేస్తాలు..నాప్రపంచం..నాకు చాలుగా!

పిజ్జా కి పీజ్జా ఆఫర్ లుంటే ఏంటి?
అయొనోక్స్ లో త్రీడి సినిమాలొస్తే ఏంటి?
నా రంగి చేసే రొట్టే నాకు అమృతం..నా బుల్లి టి.వి యే నాకు సంత్రుప్తి.

నా ప్రపంచం నాది.... రంగుల ప్రపంచాలు నాకొద్దు!
నకే వత్తిడులు వద్దు... పరుగులు పెట్టే నిత్య జీవితం ఒద్దు
నాకు తెలిసిందల్లా..రోజంతా కస్టపడటం..
సయత్రం అయ్యేసరికి..గుప్పెడు మల్లెలతో..నా రంగిని చేరటం..
సరసాలతో..సల్లాపాలతో..ఉత్సాహంగా ఉల్లాసంగా...
స్వర్గపుటంచులని తాకేయటం!

..........
ఫణీంద్ర
Top of Form