ఫణీంద్ర// హైకుహారం-1//22.07.2013
1.తళుక్కున మెరుపు
ముత్యాలు రాలుస్తూ..
ఆకాశం!
2.చలికి ఒణుకుతూ ఊరు
తెల్లదుప్పటి కప్పుకుంది
పొగ మంచు!
3.పెళ్ళి శోభ
శృతి పెంచిన సన్నాయి
కళ్ళలో కళ్ళు!
4.చీకటి రాత్రి
వెన్నెలయ్యింది నా మది
నువ్వు వచ్చావుగా!
5.జోరున వర్షం
ప్రకృతిని తలంటుతూ..
ఫ్రెష్ గా గాంధి తాతయ్య!
6.ప్రాణం తీసే బాణం
దూది పింజయ్యింది
చెలి క్రీగంటి చూపు!
7.పెదవులపై ఆత్రం
ఎంగిలికాదా మరి?
అధరామృతం!
8. సృస్టి లో మరో
మొగ్గ పువ్వయ్యే వేళ..
పురిటి నొప్పులు!
9. అర్ధరాత్రి నిశ్శబ్ధం
అరుపులే పూలజల్లులయ్యాయి
పాపాయి ఏడ్పులు!
10. విరబూసిన పువ్వులు
అత్తరు పూసుకుంటూ..
చిరుగాలి!
Phanimdra..22.07.2013
1.తళుక్కున మెరుపు
ముత్యాలు రాలుస్తూ..
ఆకాశం!
2.చలికి ఒణుకుతూ ఊరు
తెల్లదుప్పటి కప్పుకుంది
పొగ మంచు!
3.పెళ్ళి శోభ
శృతి పెంచిన సన్నాయి
కళ్ళలో కళ్ళు!
4.చీకటి రాత్రి
వెన్నెలయ్యింది నా మది
నువ్వు వచ్చావుగా!
5.జోరున వర్షం
ప్రకృతిని తలంటుతూ..
ఫ్రెష్ గా గాంధి తాతయ్య!
6.ప్రాణం తీసే బాణం
దూది పింజయ్యింది
చెలి క్రీగంటి చూపు!
7.పెదవులపై ఆత్రం
ఎంగిలికాదా మరి?
అధరామృతం!
8. సృస్టి లో మరో
మొగ్గ పువ్వయ్యే వేళ..
పురిటి నొప్పులు!
9. అర్ధరాత్రి నిశ్శబ్ధం
అరుపులే పూలజల్లులయ్యాయి
పాపాయి ఏడ్పులు!
10. విరబూసిన పువ్వులు
అత్తరు పూసుకుంటూ..
చిరుగాలి!
Phanimdra..22.07.2013
No comments:
Post a Comment