Sunday, September 1, 2013

ప్రియతమా...



//ప్రియతమా...// ఫణీంద్ర //07.06.2013
సుత్తి తో మోదకుండా..
ఉలి తో లాలిస్తే..
నేనో శిల్పాన్నవుతాను!
మరి శిల్పి గా మారుతావా ప్రియతమా..

తామరాకుపై..నీటి బొట్టులాకాకుండా..
ముత్యపు చిప్పలో పడిన వానచినుకువైతే..
నెనో ముత్యాన్నవుతాను!
మరి వాన చినుకువైపోతావా ప్రియతమా..

వెన్నెలని మ్రిగే విషనాగువి కాకుండా..
చల్లదనాన్నిచ్చే..చందమామవైపోతే.
నెనో కలువ భామనైపోతాను!
మరి చదమామవైపోతావా ప్రియతమా..

రాజ్యాలని కూల్చే రాజాధి రాజువు కాకుండా..
అన్నివేళలా నన్ను కాపాడుకోనే..మగధీరుడవైతే చాలు
నెనో అప్సర కన్నెనై పొతా!
మరి మగధీరుడవైపోతావా..ప్రియతమా..

శిల్పివైనా..వానచినుకువైనా..చందమామవైనా..
అక్కున చేర్చుకొని ఆదరించే మగధీరుదవైనా..
ఎమైనా..ఎమైనా..
నాకోసం వస్తావా ప్రియతమా.....

Top of Form

No comments:

Post a Comment