ఫణీంద్ర//అనుబంధం//04.08.2013
మావూరి చెరువు గట్టుమీద
ఓ వేప చెట్టు,రావి చెట్టూ పెనవేసుకుపోయాయి
ఓ వందేళ్ళ బంధం వాటిది!
ఇప్పటికీ చెక్కుచెదరలేదు!
మావూరి చెరువులో విరబుసే
పద్మాలు,కలువభామలు,తూటిపువ్వులు
అనురాగాలని పెంచుకుంటూ
అలా అందరినీ రంజింపజేస్తూనే వున్నాయ్
ఏనాటినుంచో!
ఆ చుక్కల గుంపులు..
ఎంత అనుబంధాన్ని పంచుకుంటున్నాయో!
తరాలుమారినా,తారలజట్టు మాత్రం ఒక్కటే
అంటున్నట్లనిపిస్తోంది నాకు!
ఎప్పుడో ఒక్క సారే!
చూసేవారికి కన్నుల విందు,ఆ హరివిల్లు!!
చిన్ననాటి నుంచీ చూస్తూనే వున్నా
జతకట్టిన ఆ ఏడు రగులూ
ఎంతకాలమైన అలా మెప్పిస్తూనే వున్నాయ్
మా మావిడి చెట్టుమీదికోయిల
కొ..అంటే
ఊరిచివరి కొండల్లోంచి..
కో..అని సమాధానం వస్తూనేవుంది
పిలిస్తే పలికే స్నెహితుడుండటం
ఎంత అదృస్టం!
……. 04.08.2013
మావూరి చెరువు గట్టుమీద
ఓ వేప చెట్టు,రావి చెట్టూ పెనవేసుకుపోయాయి
ఓ వందేళ్ళ బంధం వాటిది!
ఇప్పటికీ చెక్కుచెదరలేదు!
మావూరి చెరువులో విరబుసే
పద్మాలు,కలువభామలు,తూటిపువ్వులు
అనురాగాలని పెంచుకుంటూ
అలా అందరినీ రంజింపజేస్తూనే వున్నాయ్
ఏనాటినుంచో!
ఆ చుక్కల గుంపులు..
ఎంత అనుబంధాన్ని పంచుకుంటున్నాయో!
తరాలుమారినా,తారలజట్టు మాత్రం ఒక్కటే
అంటున్నట్లనిపిస్తోంది నాకు!
ఎప్పుడో ఒక్క సారే!
చూసేవారికి కన్నుల విందు,ఆ హరివిల్లు!!
చిన్ననాటి నుంచీ చూస్తూనే వున్నా
జతకట్టిన ఆ ఏడు రగులూ
ఎంతకాలమైన అలా మెప్పిస్తూనే వున్నాయ్
మా మావిడి చెట్టుమీదికోయిల
కొ..అంటే
ఊరిచివరి కొండల్లోంచి..
కో..అని సమాధానం వస్తూనేవుంది
పిలిస్తే పలికే స్నెహితుడుండటం
ఎంత అదృస్టం!
……. 04.08.2013
No comments:
Post a Comment