ఫణీంద్ర//పచ్చని చెట్టు//28.08.2013
ఆరోజు!
గుర్తుందా?
నీలో నన్ను,నాలోనిన్ను,చూసుకొంటూ,
ఒకరిలో మరొకరం మమేకమై,
హృదయరాగాలు పంచుకుంటూ,
మన ప్రేమకి ప్రతిరూపంగా నాటిన,
ఆ లేత చిగురుల చిన్ని మొక్క!
ఇప్పుడు!
ఎంత ఎత్తు ఎదిగింది!
ఎంత గుబురుగా పెరిగింది!
ఎన్ని పలవలు వేసింది!
కొమ్మ కొమ్మకూ ఎన్ని చిగురులు తొడిగింది!
పచ్చని ఆకుల మధ్య ఎర్రని పూలతో
చూసేవాళ్ళకి కన్నులు కుట్టేలా లేదూ?
పచ్చని చెట్టుని చూసి ముచ్చటపడుతున్నారంతా!
ఆ! అంతే కాదు!!
భవనానికి పునాదుల్లా,
భూమిలోనికి చొచ్చుకొని పోయిన
ధృఢమైన వ్రేళ్ళతో..
ఎంత బలంగా వుందోకదా !
ఇహ..
వానలొచ్చినా..
వరదలొచ్చినా..
తుఫానులొచ్చినా..
చెక్కుచెదరని బలంతో..
పచ్చగానే వుంటుంది!
పువ్వులతో విరబూస్తుంది!
ఎప్పటికీ..మరెప్పటికీ...
......28.08.2013
ఆరోజు!
గుర్తుందా?
నీలో నన్ను,నాలోనిన్ను,చూసుకొంటూ,
ఒకరిలో మరొకరం మమేకమై,
హృదయరాగాలు పంచుకుంటూ,
మన ప్రేమకి ప్రతిరూపంగా నాటిన,
ఆ లేత చిగురుల చిన్ని మొక్క!
ఇప్పుడు!
ఎంత ఎత్తు ఎదిగింది!
ఎంత గుబురుగా పెరిగింది!
ఎన్ని పలవలు వేసింది!
కొమ్మ కొమ్మకూ ఎన్ని చిగురులు తొడిగింది!
పచ్చని ఆకుల మధ్య ఎర్రని పూలతో
చూసేవాళ్ళకి కన్నులు కుట్టేలా లేదూ?
పచ్చని చెట్టుని చూసి ముచ్చటపడుతున్నారంతా!
ఆ! అంతే కాదు!!
భవనానికి పునాదుల్లా,
భూమిలోనికి చొచ్చుకొని పోయిన
ధృఢమైన వ్రేళ్ళతో..
ఎంత బలంగా వుందోకదా !
ఇహ..
వానలొచ్చినా..
వరదలొచ్చినా..
తుఫానులొచ్చినా..
చెక్కుచెదరని బలంతో..
పచ్చగానే వుంటుంది!
పువ్వులతో విరబూస్తుంది!
ఎప్పటికీ..మరెప్పటికీ...
......28.08.2013
No comments:
Post a Comment