Sunday, September 1, 2013

స్వాప్నికం



ఫణీంద్ర//స్వాప్నికం//03.08.2013

అదో స్వాప్నిక లోకం!
అక్కడ అన్నీ అందాలే
అంతా పచ్చదనమే!

ఒత్తుగా పెరిగిన చెట్లముసుగుల్లో
ఎత్తయిన కొండలు

గుండెలు ఝల్లుమనిపించే
అగాధాలు లోయలు

కొండల మధ్యన చిందులువేస్తూ
నేలపైకి దూకుతున్న జలపాతాలు

పూల మకరందాలని దొంగిలించి
భద్రంగా తమగదుల్లో దాచుకున్న తేనెటీగలు

కొమ్మకొమ్మకు ఎగురుతూ
కుహు కుహు రాగాలు తీస్తున్న పక్షులు

అకాశానికి పరదాలు కప్పిన
దట్తమైన    ఆకుల పొదలు

గాలికి రెపరెపలాడే పరదాల మధ్యనుంచి
చిలిపిగ తొంగిచూసే లేతకిరణాలు..

సెలయేటి నీట మునిగి,
మరింత స్వచ్చమైన బంగారు కిరణాలు
నా తనువును తట్టి తరం గాలు రేపుతుంటే
హృదయంలో ఏదో పులకింత!ఏదో మెరుపు!!

అప్పుడు కనిపించావు నువ్వు!

సగం మునిగి,సగం మునగక
సెలయేటి నీటికి ఎదురునిలిచిన
ఎన్నో నల్ల రాళ్ళమధ్య
అందమైన శిలపై
ప్రకృతి చెక్కిన శిల్పంలా.....
                  …..03.08.2013




No comments:

Post a Comment