Sunday, September 1, 2013

అమ్మచేతి గోరుముద్దలు



ఫణీంద్ర//అమ్మచేతి గోరుముద్దలు//

అమ్మ చేతి గోరుముద్దలు
తినను తినననే తిక్క పట్లు

చందమామ రావే..జాబిల్లి రావే
అమ్మ పాటల ఊరింపులు

కడుపు నిండి కనురెప్పలు వాలుతుంటే
జో..అచ్చుతానందా..జోలపాటలు

అమ్మ ఒడిలో హాయిగా నిదురోయే
చిన్ననాటి అనుభూతులు,
మళ్ళీ అనుభవించేలా
నేను చిన్నారినైపోతే....

నాన్న గుండెలమీద నిద్ర
ఏడు చేపలకధలు పిట్టకధలు!

రాక్షసుల, రాకాసి లోయల వర్ణనలు
రాముడు..కృష్ణుడు..సితా రాధికల గాధలు


ఊకొడుతూ నిదురోయే మగత..
మళ్ళీ అనుభవించేలా
నేను బుడుతడినైపోతే....

ముంగిట కట్టిన ధాన్యపు కంకులు
చుట్టూ మూగిన పొట్టిపిచుకల కిచకిచలు

చిట్టీ చిలకమ్మల మాటలు..కోయిలమ్మల పాటలు
వెన్నెల రాత్రులు..ఆటలు..పాటలు

కొలనులో విచ్చుకునే కలువలు
చెరువంతా విరబూసే ఎర్ర తామరులు


ఊరి దేవత సంబరాలు..వీధి నాటకాలు
ఎన్నో..ఎన్నో..మరెన్నో..
తనివితీరా మళ్ళీ అనుభవించేలా..
అందరూ ముద్దులిచ్చేలా, నేను
చిన్ని పిల్లాడినైపోతే....

....
ఫణీంద్ర

మనోవేదన..


ఫణీంద్ర//మనోవేదన//25.08.2013

ఒకప్పుడు!

బొసినవ్వుల ముద్దుల మావయ్యను నేనేగా!
గోరుముద్దలు తినిపించే తల్లుల పాటల పల్లవినీ నేనేగా!
నాన్నలు చెప్పే కధలు కబుర్లు నేనై, పాయిలని నిద్రపుచ్చేవాణ్ణిగా
కోటి పూలు,బండినిండా బంతిపూలు బుజ్జాయిలకి పంచేవాణ్ణిగా
అసలు నన్ను పిలవందే బుడుతలు బువ్వ ముట్టేవారా?

కన్నెపిల్లలాడుకొనే వెన్నెలాటలకి ఎంత సంబర పడిపోయే వాణ్ణి!
వెన్నెల్లో వొళ్ళు మరచి పరవసించే ప్రేమజంటల్నిచూసి ఎంత మురిసే వాణ్ణి! 

అలంటిది,ఇప్పుడు..

ముద్దుల పాపయిలకి తెలుసా ఆకశంలో అందాల చందమామ వున్నాడని?
ముద్దలు కుక్కటమే తప్ప,
ముద్దుచేసి మావయ్యని పిలవడం తెలుసా నాటి తల్లులకి?
చిన్నారులు నిద్దురోయాకె ఇళ్ళకి చేరే నాన్నలు,
నాపై కధలేం చెబుతారు?
కోటిపూలు,బండినిండా బంతిపూలు తెచ్చి ఎవరికి పంచను?

వెన్నెలాటలాడే కన్నెపిల్లలేరి?
నా వెన్నెలని ఆస్వాదించే ప్రేమ జంటలేవి?

పిల్లలు,ప్రెమికులు కూడా పట్టించుకోని నేను
పిచ్చివాడిలా మారాను!
నేనే కాదు..
నాలా ఎందరో!

చూస్తూనేవున్నా..
వయసుకు విలువివ్వక,
అనుభవాన్ని లెఖచేయక,
పంచే ప్రేమని పట్టించుకోక,
తమ ఉనికినే గుర్తించని
మరమనుషుల మధ్య నలిగిపోతూ,
మనో వేదనతో బ్రకుకులీడ్చే
ఎందరినో...మరెందరినో...

.....25.08.2013

నీకుతెలుసా?


ఫణీంద్ర//నీకుతెలుసా//19.08.2013

కౌమారము నుంచి యౌవ్వనం వైపు
అడుగులు వేస్తున్న వయసు..
తొలిఆడుగులోనే తుళ్ళి పడింది
పెరటి పందిరంతా పాకిన సన్నజాజి
సిగ్గుపడి మెలికలు తిరిగింది
మొగ్గలన్నీ ఒక్కసారిగా పువ్వులై
ప్రే మ పరిమళాన్ని గుప్పుమనిపించాయ్!
చూపుల్లో చూపులు కలిపి నవ్విన
నీనవ్వు చిలిపితనమేమిటో నీకుతెలుసా?

హృదయాన్నెవరో తట్టినట్లంపించింది!
తీరా చూ స్తే
ఏముంది?
బాణం మీద బాణం సంధిస్తూ నువ్వు!
బాణాలు పూవులే అయినా గుచ్చుకోవా గుండెల్లో?
నీ క్రీగంటి చుపులెంత పదునో నీకు తెలుసా?

నా నడకలు పూర్తిగా అదుపు తప్పాయ్!
వీధిచివరి పెంకుటింటి వరకే పరిమైతమయ్యాయ్
ఇంటిముందు విప్పారిన మందారాల లో
నువ్వో ముద్ద మందారానివి!
దోలా  ఒక్కసారి నీ అందాలు చూడందే
మనసు కుదుట పడదే!
నచ్చిన వాడిని చిత్తుచేసే ఆయుధాలన్నీ
నీదగ్గరే వున్నాయని నీకు తెలుసా ?

డెభైరెండు నుటడెభైరెండు అవుతొందేమిటి?
అదుపుతప్పిన గుండె అంతకంటే ఏం చేస్తుంది?
యౌవ్వనమంటే...లబ్ డబ్ కి బదులు ప్రేమ ప్రేమ అనుకోమని
గుండెకు పాఠాలు నేర్పించడమా?
నువ్వు నేర్పే పాఠాలు ఎంత గొప్పవో నీకు తెలుసా....

………19.08.2013




హృదయస్పందన

ఫణీంద్ర //హృదయస్పందన //07.07.2013

మొదటి చూపులోనే పూలబాణాలువేసి
మన్మధ సామ్రాజ్యానికి మహారాణిని చేసావ్

బాహువ్వులో బందీని చేసి
నీ శ్వాసని నా శ్వాసగా మార్చావ్

ప్రేమగా లాలించి నుదుటిపైముద్దులిచ్చి
నా హృదయంలొ గిలిగింతలు రేపావ్

సిగ్గుమొగ్గయిన నా బుగ్గల సొట్టలపై చిటికేసి
సిగ్గులకే నిగ్గులు నేర్పావ్

తేనెలూరే పెదవులని తమకంగా పలుకరించి
సుధామాధుర్యాన్ని చవి చూపావ్

నీ హృదయాన్నె కానుకగా నాకిచ్చి
నాలో నివైపోయావ్

ముచ్చటైన మూడు ముళ్ళబంధం తో
మన అనుభందాన్ని శాశ్వతం చేసావ్

వీడిపోని మన అనురాగ బంధం
ఇలానే...
ఎప్పటికీ...మరెపాటికీ.....

(
పెళ్ళయిన కొత్తలో అమ్మాయి హృదయస్పందన)......ఫణీంద్ర

తొలిపులకింత


ఫణీంద్ర//అమ్మచేతి గోరుముద్దలు//

అమ్మ చేతి గోరుముద్దలు
తినను తినననే తిక్క పట్లు

చందమామ రావే..జాబిల్లి రావే
అమ్మ పాటల ఊరింపులు

కడుపు నిండి కనురెప్పలు వాలుతుంటే
జో..అచ్చుతానందా..జోలపాటలు

అమ్మ ఒడిలో హాయిగా నిదురోయే
చిన్ననాటి అనుభూతులు,
మళ్ళీ అనుభవించేలా
నేను చిన్నారినైపోతే....

నాన్న గుండెలమీద నిద్ర
ఏడు చేపలకధలు పిట్టకధలు!

రాక్షసుల, రాకాసి లోయల వర్ణనలు
రాముడు..కృష్ణుడు..సితా రాధికల గాధలు


ఊకొడుతూ నిదురోయే మగత..
మళ్ళీ అనుభవించేలా
నేను బుడుతడినైపోతే....

ముంగిట కట్టిన ధాన్యపు కంకులు
చుట్టూ మూగిన పొట్టిపిచుకల కిచకిచలు

చిట్టీ చిలకమ్మల మాటలు..కోయిలమ్మల పాటలు
వెన్నెల రాత్రులు..ఆటలు..పాటలు

కొలనులో విచ్చుకునే కలువలు
చెరువంతా విరబూసే ఎర్ర తామరులు


ఊరి దేవత సంబరాలు..వీధి నాటకాలు
ఎన్నో..ఎన్నో..మరెన్నో..
తనివితీరా మళ్ళీ అనుభవించేలా..
అందరూ ముద్దులిచ్చేలా, నేను
చిన్ని పిల్లాడినైపోతే....

....
ఫణీంద్ర