Sunday, September 1, 2013

ప్రియసఖి


ఫణీంద్ర//ప్రియసఖి//13.08.2013

ఉగ్గుపాలతో ప్రేమని రంగరించి
తన అనురగాన్నంతా పంచిన అమ్మ,

కమ్మని కబుర్లు,కధలతో
లాలించి నిద్రపుచ్చే నాన్న,

మంచి స్నేహితుడిలా
ఎప్పుడూ నాతోడుండే అన్న,

అల్లరి పట్టించి,ఉడికించి
చిలిపిగా ముద్దాడే అత్త,

నన్ను చూసి మురిసి పోతూ
మురిపాలు కురిపించె,
అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యలు !

మరివీరందరిలో..
పరకాయ ప్రవేశం చేసి,
నూనూగు మీసాల మనోహరుడి
హృదయం దొచుకున్నావుకదా!
ప్రియ సఖీ...

ప్రేమ పిచ్చి



ఫణీంద్ర//ప్రేమ పిచ్చి//02.08.2013

నాకేమీ కనిపించటంలేదు,
నీ రూపం తప్ప..

నాకేమీ వినిపించటం లేదు,
తేనెలూరే నీ పలుకులు తప్ప..

నాకే వాసనలు నచ్చటం లేదు,
నీ శ్వాస లోని పరిమళాలు తప్ప..

నాకే స్పర్శ తెలియడం లేదు,
నుదుటిపై పెట్టిన నీ ముద్దులు తప్ప..

నాకే రుచులు సహించటం లేదు,
నీ అధరామృతంలోని తియ్యదనం తప్ప..

ఏమయిందినాకు?


ఫణీంద్ర//ఏమయిందినాకు?//22.07.2013

ఏమయింది నాకు?

నా మనసు నాలో లేకుండా,
దూది పింజై ఎగిరిపోతోందేమిటి?

నా గుండె లయ తప్పి,
ఉద్వేగంగా శబ్దాలు చేస్తోందేమిటి?

నా కళ్ళకు నిదుర రానీకుండా,
కనురెప్పలపై నీరూపం నాట్యం చేస్తోందేమిటి?

నిద్ర నిద్రలా కాకుండా కలతనిద్రవుతూ,
కలల్లోకూడా కవ్వించి,నిద్దుర పోనీయడేంటి?

కలివిడిగా ఉరకలు వేసే నేను అందరిని వదిలి,
ఒంటరితనాన్ని కోరుకుంటున్నానేమిటి?

గల గల లాడే నాకాలి చిరుమువ్వలు,మూగవోతూ,
నిశ్శబ్దంగా నిదురోతున్నాయేమిటి?

నిన్నటివరకు ఎవరికీ చోటీయని నా హృదయం,
రోజిలా నీకోసం పరితపిస్తోందేమిటి?

అయినా..
అనుభూతులన్నీ,
బహు గమ్మత్తుగా,
గిలిగింతలుపెడుతున్నాయి సుమీ....\
***

అమ్మచేతి గోరుముద్దలు



ఫణీంద్ర//అమ్మచేతి గోరుముద్దలు//

అమ్మ చేతి గోరుముద్దలు
తినను తినననే తిక్క పట్లు

చందమామ రావే..జాబిల్లి రావే
అమ్మ పాటల ఊరింపులు

కడుపు నిండి కనురెప్పలు వాలుతుంటే
జో..అచ్చుతానందా..జోలపాటలు

అమ్మ ఒడిలో హాయిగా నిదురోయే
చిన్ననాటి అనుభూతులు,
మళ్ళీ అనుభవించేలా
నేను చిన్నారినైపోతే....

నాన్న గుండెలమీద నిద్ర
ఏడు చేపలకధలు పిట్టకధలు!

రాక్షసుల, రాకాసి లోయల వర్ణనలు
రాముడు..కృష్ణుడు..సితా రాధికల గాధలు


ఊకొడుతూ నిదురోయే మగత..
మళ్ళీ అనుభవించేలా
నేను బుడుతడినైపోతే....

ముంగిట కట్టిన ధాన్యపు కంకులు
చుట్టూ మూగిన పొట్టిపిచుకల కిచకిచలు

చిట్టీ చిలకమ్మల మాటలు..కోయిలమ్మల పాటలు
వెన్నెల రాత్రులు..ఆటలు..పాటలు

కొలనులో విచ్చుకునే కలువలు
చెరువంతా విరబూసే ఎర్ర తామరులు


ఊరి దేవత సంబరాలు..వీధి నాటకాలు
ఎన్నో..ఎన్నో..మరెన్నో..
తనివితీరా మళ్ళీ అనుభవించేలా..
అందరూ ముద్దులిచ్చేలా, నేను
చిన్ని పిల్లాడినైపోతే....

....
ఫణీంద్ర

మనోవేదన..


ఫణీంద్ర//మనోవేదన//25.08.2013

ఒకప్పుడు!

బొసినవ్వుల ముద్దుల మావయ్యను నేనేగా!
గోరుముద్దలు తినిపించే తల్లుల పాటల పల్లవినీ నేనేగా!
నాన్నలు చెప్పే కధలు కబుర్లు నేనై, పాయిలని నిద్రపుచ్చేవాణ్ణిగా
కోటి పూలు,బండినిండా బంతిపూలు బుజ్జాయిలకి పంచేవాణ్ణిగా
అసలు నన్ను పిలవందే బుడుతలు బువ్వ ముట్టేవారా?

కన్నెపిల్లలాడుకొనే వెన్నెలాటలకి ఎంత సంబర పడిపోయే వాణ్ణి!
వెన్నెల్లో వొళ్ళు మరచి పరవసించే ప్రేమజంటల్నిచూసి ఎంత మురిసే వాణ్ణి! 

అలంటిది,ఇప్పుడు..

ముద్దుల పాపయిలకి తెలుసా ఆకశంలో అందాల చందమామ వున్నాడని?
ముద్దలు కుక్కటమే తప్ప,
ముద్దుచేసి మావయ్యని పిలవడం తెలుసా నాటి తల్లులకి?
చిన్నారులు నిద్దురోయాకె ఇళ్ళకి చేరే నాన్నలు,
నాపై కధలేం చెబుతారు?
కోటిపూలు,బండినిండా బంతిపూలు తెచ్చి ఎవరికి పంచను?

వెన్నెలాటలాడే కన్నెపిల్లలేరి?
నా వెన్నెలని ఆస్వాదించే ప్రేమ జంటలేవి?

పిల్లలు,ప్రెమికులు కూడా పట్టించుకోని నేను
పిచ్చివాడిలా మారాను!
నేనే కాదు..
నాలా ఎందరో!

చూస్తూనేవున్నా..
వయసుకు విలువివ్వక,
అనుభవాన్ని లెఖచేయక,
పంచే ప్రేమని పట్టించుకోక,
తమ ఉనికినే గుర్తించని
మరమనుషుల మధ్య నలిగిపోతూ,
మనో వేదనతో బ్రకుకులీడ్చే
ఎందరినో...మరెందరినో...

.....25.08.2013

నీకుతెలుసా?


ఫణీంద్ర//నీకుతెలుసా//19.08.2013

కౌమారము నుంచి యౌవ్వనం వైపు
అడుగులు వేస్తున్న వయసు..
తొలిఆడుగులోనే తుళ్ళి పడింది
పెరటి పందిరంతా పాకిన సన్నజాజి
సిగ్గుపడి మెలికలు తిరిగింది
మొగ్గలన్నీ ఒక్కసారిగా పువ్వులై
ప్రే మ పరిమళాన్ని గుప్పుమనిపించాయ్!
చూపుల్లో చూపులు కలిపి నవ్విన
నీనవ్వు చిలిపితనమేమిటో నీకుతెలుసా?

హృదయాన్నెవరో తట్టినట్లంపించింది!
తీరా చూ స్తే
ఏముంది?
బాణం మీద బాణం సంధిస్తూ నువ్వు!
బాణాలు పూవులే అయినా గుచ్చుకోవా గుండెల్లో?
నీ క్రీగంటి చుపులెంత పదునో నీకు తెలుసా?

నా నడకలు పూర్తిగా అదుపు తప్పాయ్!
వీధిచివరి పెంకుటింటి వరకే పరిమైతమయ్యాయ్
ఇంటిముందు విప్పారిన మందారాల లో
నువ్వో ముద్ద మందారానివి!
దోలా  ఒక్కసారి నీ అందాలు చూడందే
మనసు కుదుట పడదే!
నచ్చిన వాడిని చిత్తుచేసే ఆయుధాలన్నీ
నీదగ్గరే వున్నాయని నీకు తెలుసా ?

డెభైరెండు నుటడెభైరెండు అవుతొందేమిటి?
అదుపుతప్పిన గుండె అంతకంటే ఏం చేస్తుంది?
యౌవ్వనమంటే...లబ్ డబ్ కి బదులు ప్రేమ ప్రేమ అనుకోమని
గుండెకు పాఠాలు నేర్పించడమా?
నువ్వు నేర్పే పాఠాలు ఎంత గొప్పవో నీకు తెలుసా....

………19.08.2013